Sirimalli

My WordPress Blog

Spirit : స్పిరిట్ నుండి ప్రకాష్ రాజ్ తప్పుకోవడానికి కారణం ఇదే..

Spirit Prabhas Prakash Raj Exit Sandeep Vanga Creative Differences

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటైన ‘స్పిరిట్’ సెట్స్ నుండి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ స్పిరిట్ నుండి వైదొలిగాడు. ఈ సినిమాపై అంచనాలను పెంచిన ఆడియో టీజర్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ వినబడింది. అందులో ఆయన ఒక జైలర్ పాత్రలో ప్రభాస్‌ను విచారిస్తున్నట్లుగా గంభీరమైన గొంతుతో ఆకట్టుకున్నారు.

Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా భారీ మైథలాజికల్ సినిమా ఫిక్స్

అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ప్రకాష్ రాజ్ కు మధ్య తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు సమాచారం. అయితే, షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే దర్శకుడి మేకింగ్ స్టైల్ లేదా సీన్ల చిత్రీకరణ విషయంలో దర్శకుడితో ప్రకాష్ రాజ్ కు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన తప్పుకొన్నాడట. ఈ సినిమా ప్రారంభం నుండి నటీనటుల మార్పుల విషయంలో వార్తల్లో నిలుస్తోంది. మొదట ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా, ఆమె స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రిని తీసుకున్నాడు సందీప్ రెడ్డి. ఇప్పుడు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ స్థానంలో మరొక నటుడిని తీసుకుంటారా లేదా సందీప్ వంగా ఆయనను ఒప్పిస్తారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ వార్తలపై అటు ప్రకాష్ రాజ్ గానీ, ఇటు చిత్ర యూనిట్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభాస్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.