Sirimalli

My WordPress Blog

అనకాపల్లిలో పసికందును నదిలో పడేసిన కన్నతల్లి

అమరావతి: తొలి ప్రసవం తరువాత ఓ మహిళ మానసిక వ్యాధితో పసికందును శారద నదిలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చోడవరం కోటవీధిలో లీల, శివ అనే దంపతులు నివసిస్తున్నారు. గత సంవత్సం ఈ దంపతులకు పెళ్లి జరగగా 40 రోజుల క్రితం లీల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తరువాత లీల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో బంధువులకు సమీపంలో శివ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. శివ శనివారం తన సొంతూరు నరేంద్రపురం వెళ్లగా రాత్రి బిడ్డను తీసుకొని లీల బయటకు వెళ్లింది. ఈ విషయం తెలిసిన వెంటనే భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భార్య భర్తకు ఫోన్ చేసి గోవాడ చక్కెర ఫ్యాక్టరీ దగ్గర ఉన్నానని సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు, భర్త ఆమె వద్దకు చేరుకొని బిడ్డ ఎక్కడ ఉందని అడిగారు. చేతిలో నుంచి జారి శారద నదిలో పడిందని తెలిపింది. వెంటనే పోలీసులు, గజఈతగాళ్లు శారద నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో తన భార్య ఇంట్లో నుంచి ఒకసారి వెళ్లిపోయిందని భర్త తెలిపాడు.