మాస్కో: రష్యాలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఉఫాలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో యువకుడు కత్తితో హల్‌చల్ చేశారు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతోన నలుగురు భారతీయ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రష్యాకు చెందిన విద్యార్థులు కూడా గాయపడినట్టు సమాచారం. నలుగురు భారతీయ విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని ఇండియన్ ఎంబసీ తెలిపింది. ప్రాణహాని లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వ అధికారులతో తాము మాట్లాడుతున్నామని ఎంబిసి అధికారులు వివరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది.





