హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లాలో గిరిజన హాస్టల్ లో దారుణం జరిగింది. దారకొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో హెచ్ఎం దాష్టీకానికి పాల్పడ్డాడు. భోజనం బాగోలేదని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు చితకబాదాడు. హెచ్ఎం కొట్టిన దెబ్బలకు విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం దారకొండ నుంచి విద్యార్థులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులను చూడటానికి హాస్పటల్ వద్దకు చేరారు. పిల్లలను చితకబాదిన హెడ్ మాస్టర్ పై ఎస్సి, ఎస్టి ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని దండకారుణ్య సమితి సభ్యులు డిమాండ్ చేశారు.





