Sirimalli

My WordPress Blog

17 ఏళ్ల బాలుడితో 37 ఏళ్ల మహిళ అక్రమ సంబంధం… అత్త గొంతు కోసి

అమరావతి: 37 ఏళ్ల వివాహిత, మైనర్‌తో వివాహేతర సంబందం పెట్టుకొని అత్త, భర్తను చంపేందుకు బాలుడిని ఉసిగొల్పింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గిరింపేట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గిరింపేట ప్రాంతంలో 37 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యతో గొడవపెట్టుకున్నాడు. అక్రమ సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉండడంతో వారిని తొలగించాలని బాలుడితో ప్లాన్ వేసింది. భర్తలేని సమయంలో ఇంట్లో అత్త ఒంటరిగా పడుకుంది. బాలుడు అత్త కళ్లలో కారం కొట్టి గొంతు కోశాడు. అత్త కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు బాలుడి పట్టుకొని వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. వెంటనే కోడలు ఇంట్లో నుంచి పారిపోయింది. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.