Sirimalli

My WordPress Blog

అండర్-19 ప్రపంచ కప్ విజేతలకు సిఎం రేవంత్ అభినందనలు

హైదరాబాద్: అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విశ్వ వేదికపై మన క్రీడాకారుల విజయ పరంపర దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. యువ ఛాంపియన్ల అసమాన ప్రతిభ భారత క్రికెట్ భవిష్యత్తుకు మరింత భరోసానిస్తోందని పేర్కొన్నారు. అంకితభావం, నైపుణ్యం, పోరాట పటిమలో గత తరం క్రీడాకారుల స్ఫూర్తిని కొనసాగిస్తూనే, ఈనాటి యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటడం అభినందనీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు.

అండర్ 12 వరల్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఘన విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌పై టీమిండియా వంద పరుగుల తేడా భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేశారు. వైభవ్ 80 బంతుల్లో 175 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ సూర్య వంశీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.