మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: నేను అందరివాడను.. నాకు కులం, మ తం లేదు.. అన్ని కులాలను, మతాలను స మన్వయం చేసుకుని రాష్ట్రాన్ని నెంబర్ వ న్గా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంలో లక్షల కోట్లు మింగిన కెసిఆర్, హరీశ్‌రావులకు జైల్లో పెట్టడానికి కేంద్రం ఎందుకు వెనుకాడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. త మకు అవకాశం ఇస్తే 48గంటల్లో జైల్లో పెడ్తామని బీరాలు పలికిన కిషన్ రెడ్డి ఏబొక్కెలో దాక్కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆయన శుక్రవారం నిజామాబాద్ శి వారులోని బర్దిపూర్‌లో వివిధ అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగి న సభలో మాట్లాడారు. కాళేశ్వరం బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటియంలా మారిందని స్వయంగా మోడీ, అమిత్ షాలు తెలంగాణకు వచ్చి చెప్పారని గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని కెసిఆర్ కోట్ల రూపాయ లు కొల్లగట్టారని అసెంబ్లీలో తీర్మానం చే సి సిబిఐ విచారణ జరపాలని కేంద్రానికి సిఫారసు చేస్తే ఆరు నెలలు అయినా ఎం దుకు పట్టించుకోవడం లేదన్నారు. లక్షల కోట్లు దిగమింగిన కెసిఆర్, హరీశ్‌రావుల ను కిషన్‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇఫార్ములా కేసు లో కెటిఆర్ మీద చర్యలు తీసుకోవాలంటే ఆపైలును మోడీ ఆఫీస్‌లో మూలకు పడేశారన్నారు. తనను రేవంత్ ఉద్దీన్‌గా సం బోధిస్తున్న రాంచందర్ రావు, కిషన్‌రెడ్డి కెసిఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది. కనిపించడం లేదా అన్నారు. కాళేశ్వరం అక్రమాల మీద విచారణకు సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కెసిఆర్ హరీష్‌రావులో జైళ్లో వేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కిషన్‌రావుగా మారారని అన్నారు.
కెసిఆర్‌కు దత్తపుత్రుడుగా మారారని ఆరోపించారు. కెసిఆర్, కెటిఆర్లను జైళ్లో పెట్టి చిప్పకుడు తినిపించాలని నిజామాబాద్ ఎంపి అర్వింద్ పదేపదే అంటున్నాడని అర్వింద్‌కు మోడీ వద్ద పరపతి ఉంటే ఆయనే వెళ్లి అడగాలన్నారు. కిషన్ రెడ్డి కెసిఆర్, కెటిఆర్లను ఏలా కాపాడుతున్నారో అర్వింద్‌కు కనిపించడం లేదా అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపిలను గెలిపిస్తే కేంద్రం నుంచి నయా పైసా తేవడం లేదన్నారు. బిజెపి, బిఆర్ఎస్లది ఫెవికాల్ బంధంగా మారిందని వారు వీణ వాణిలా మారారని ఆయన ధ్వజమెత్తారు. వారికి ఓట్లు వేస్తే మూసిలో వేసినట్లేనన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే మీ ప్రాంతాలకు అభివృద్ధి చేసే బాధ్యత మున్సిపల్ మంత్రిగా తీసుకుంటానని అన్నారు. అధికారం వచ్చిన రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు ఇచ్చామని, తలలు లెక్కపెట్టి చూపిస్తామని అన్నారు. లేదంటే ఒకటి తగ్గినా తన తల తీసుకుంటున్నానని సవాల్ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే అజారుద్దీన్‌కు ఎలాంటి పదవీ లేకున్నా క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చామని, త్వరలోనే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని 8 మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే షబ్బీర్ అలీ ఓడిన ప్రభుత్వ సలహాదారుడిగా పదవి ఇచ్చామని అన్నారు. అన్ని వర్గాలు నన్ను అక్కున చేర్చుకున్నామని రేవంత్‌రెడ్డి బిసి రిజర్వేషన్లను అమలు చేస్తే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రేవంత్‌గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 40 రోజుల్లో వర్గీకరణకు చట్టభద్రత కల్పిస్తే మంత్రి దామోదర్ రాజ నర్సింహ తనను రేవంత్ మాదిగ అన్నారని, అందుకు తాను ఎంతో సంబరపడ్డనన్నారు. అలాగే వాకాటి శ్రీహరికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే ముదిరాజ్‌లంతా తనను రేవంత్ ముదిరాజ్ అన్నారని ముదిరాజ్‌లు తమవాడిగా అక్కున చేర్చుకుంటే సంతోష పడ్డానన్నారు.
అతిచిన్న వయసులో అనిల్ యాదవ్‌ను పంపితే సాధారణ సభలో తనను రేవంత్ యాదవ్‌గా సంబోధించారని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలు తనను అక్కున చేర్చుకున్నాయన్నారు. నేను అందరివాడినని సిఎం ఈ సందర్భంగా ప్రకటించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నామని మహిళల పుట్టింటికి వెళ్లాలంటే భర్త ముందు చెయ్యి చాపేదని కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అవకాశం ఇచ్చామన్నారు. ఆర్థిక భారం అయినా మహిళలకు ఇచ్చిన మాట కోసం వెనక్కి వెళ్లబోమన్నారు. పేద ప్రజల ఇండ్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామన్నారు. నిండు మనస్సుతో తమ ప్రభుత్వాన్ని దీవించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలన్నారు. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండగా మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారని పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు మహేష్ పిసిసి చీఫ్ అయ్యారు. నేను సీఎంగా మహేష్ పిసిసి చీఫ్‌గా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గతంలో ఇదే జిల్లాకు చెందిన డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా వై ఎస్ సి ఎల్పీ లీడర్‌గా ఉండి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారని వైఎస్ సిఎంగా డిఎస్ పిసిసి చీఫ్‌గా ఉండి రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





