Sirimalli

My WordPress Blog

హైదరాబాద్‌కు వస్తుండగా ప్రైవేటు బస్సు దగ్ధం…

అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంచికర్ల మండలంలో ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. 39 ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కేసర టోల్ గేట్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం ప్రయాణికులు కిందకు దిగమని కేకలు వేశాడు. ప్రయాణికులు దిగిన వెంటనే చూస్తుండగానే బస్సు కాలి బూడిదగా మారింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు.