Sirimalli

My WordPress Blog

హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్..

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్‌గా అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ బీసీసీఐ అంబుడ్స్‌మన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు అరెస్ట్ అయిన తర్వాత గత 9 నెలలుగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే తనను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించాలంటూ ఇటీవలే అమర్‌నాథ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంబుడ్స్‌మన్, అమర్‌నాథ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

The post హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. appeared first on Navatelangana.