Sirimalli

My WordPress Blog

సముద్రంలో పడిన హెలికాప్టర్

మాయాబందర్: హెలికాప్టర్ ల్యాండ్ చేస్తుండగా చివర నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రంలో పడిపోయిన సంఘటన అండమాన్ ద్వీపంలోని ఉత్తర భాగం తహసీల్ కేంద్రానికి సమీపంలో జరిగింది. పవన్ హాన్స్ హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కలిసి అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ నుంచి బయలుదేరింది. తహసీల్ ప్రాంతంలోని మాయాబందర్ రన్‌వేకు దాదాపుగా 300 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని పైలట్ సముద్రంలో ల్యాండింగ్ చేశాడు. ఏడుగురిని రక్షించామని పౌర విమానయాన అధికారులు వెల్లడించారు.