నాగర్కర్నూల్: మినీ వ్యాన్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కర్నాటకకు చెందిన పది మంది భక్తులు మినీ వ్యాన్లో శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.






