అమరావతి: నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం అబ్బూరు కాటేజీలో అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ తో అబ్బూరు కాటేజీలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సమయంలో కాటేజీలో 20 మంది భక్తులు బస చేస్తూండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు గమనించి కాటేజీ నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





