Sirimalli

My WordPress Blog

శింగనమల తరిమెల గ్రామంలో దారుణం.. రెండు హత్యలు

అమరావతి: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శింగనమల తరిమెల గ్రామంలో డబుల్ మర్డర్ లు జరిగాయి. తల్లి, కుమారుడును హత్య చేశారు. కొంతకాలంగా నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యల మధ్య విభేదాలు తలెత్తాయి. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నారు. ఆస్తికోసం పిన్ని, కొడుకును మొదటి భార్య కుమారులు చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు యల్లమ్మ(38),కుమారుడు చిన్న (22) గా పోలీసులు గుర్తించారు.