Sirimalli

My WordPress Blog

విజయ్ దేవరకొండ తల్లిగా..?

విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న‘రౌడీ జనార్థన‘ సినిమాకు బ్లాక్‌బస్టర్ ప్రామిస్ ఇస్తున్నారు దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ సినిమా టీజర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. అయితే ఈ వారం కొన్ని యాక్షన్ సీన్స్ ను తీస్తున్నారని.. వీటిని విజయ్ దేవరకొండ లేకుండానే షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్స్ లో ఆమె హీరోకి తల్లి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.