వికారాబాద్: పాత కక్షల నేపథ్యంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాంపూర్ తండాకు చెందిన శంకర్ అనే వ్యక్తి కోడి పంచాయతీ విషయంలో ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. మృతుడు కుమారుడు సాయి నిందితుడు శంకర్‌పై పగ పెంచుకున్నాడు. శంకర్ జైలు నుంచి విడుదల కాగానే హత్య చేయాలని కొన్ని రోజులుగా ప్లాన్ వేస్తున్నాడు. ధారూర్‌లో శంకర్ కనిపించగా అతడిని స్కూటీతో సాయి ఢీకొట్టాడు. అనంతరం కత్తి తీసుకొని అతడిపై పలుమారు పొడిచాడు. సాయి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





