Sirimalli

My WordPress Blog

వరకట్న వేధింపులు భరించలేక డిప్యూటీ జైలర్ భార్య ఆత్మహత్య!

నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్‌లోని సమస్తిపూర్‌లో డిప్యూటీ జైలర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. 2023 మే నెలలో అసిస్టెంట్ జైల్ సూపరింటెండెంట్ నందు చౌదరీతో శ్వేతా కుమారి వివాహం జరిగింది. ఈ క్రమంలో శ్వేత అత్తారింట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. అయితే అత్తింటి వేధింపులే కారణమని, రూ.10 లక్షలతో సహా ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వాలని శ్వేతాను వేధించారని, 3 రోజులు ఆహారం పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసి హత్య చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భర్త, అత్తింటి వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

The post వరకట్న వేధింపులు భరించలేక డిప్యూటీ జైలర్ భార్య ఆత్మహత్య! appeared first on Navatelangana.