నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బన్స్వారాలో పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
The post లోయలో పడిన పెండ్లి బస్సు.. ముగ్గురు మృతి appeared first on Navatelangana.





