Sirimalli

My WordPress Blog

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

నవతెలంగాణ – హైదరాబాద్ : జిల్లాలోని మంథనిలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంథని సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాసర్ల రాజేందర్, భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం స్వీకరిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ. 16,500 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. రాజేందర్ సూచన మేరకు, బాధితుడు ఆ డబ్బును రషీద్ అనే ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్‌కు మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు.

The post లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ appeared first on Navatelangana.