హైదరాబాద్: సోషల్ మీడియా వచ్చిన తరువాత ఎప్పుడు ఎవరు వైరల్ అవుతున్నరో అర్థం కావడం లేదు. రాత్రికి రాత్రే కొందరు సెలబ్రిటీ లిస్ట్ లో చేరిపోతున్నారు. ఒక వీడియో వైరల్ అయితే చాలు వాళ్లు సెలబ్రిటీలు అవుతున్నారు. మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పు పట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్‌ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది వైరల్ గా మారి ఓ విదేశీయుడి కంట్లో పడింది. విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడికి పాత ట్రాక్టర్ నచ్చడంతో పాటు ఆ వాహనం అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించారు. వెంటనే ట్రాక్టర్ యజమానికి రూ.1.25 కోట్లు చెల్లించి పాత ట్రాక్టర్ ను కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్టుతో ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించడంలో ఉంటుందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.





