Sirimalli

My WordPress Blog

రెండో పెళ్లి చేసుకుంటున్న టీమిండియా మాజీ ఓపెనర్

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ధావన్ గత కొన్ని రోజుల నుంచి సోఫీ షైన్ అనే యువతితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. ఇద్దరు మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. అతడు మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. సోఫి షైన్, ధావన్‌కు సంబంధించిన సంగీత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంగీత్ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు హాజరైనట్టు సమాచారం. రెండో రోజుల్లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. 2012లో ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను ధావన్ వివాహం చేసుకున్నాడు. 2023లో ఆమెకు అతడు విడాకులు ఇచ్చాడు. భారత జట్టులో రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేసేవాడు. ఫామ్ ఇబ్బంది పడడంతో అదే సమయంలో గిల్ ఓపెనర్‌గా పాతుకుపోవడంతో దావన్ ప్లేస్ టీమిండియాలో గల్లంతైంది. దీంతో మూడు ఫార్మాట్లకు అతడు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ధావన్ వన్డేలలో 167 ఇన్నింగ్స్‌లలో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో కలిసి 6793 పరుగులు చేశాడు. టి20ల్లో 68 మ్యాచ్‌లలో 11 హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు 1759 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 10867 పరుగులు చేశాడు. ఐపిఎల్‌లో కూడా 222 మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలతో 6769 పరుగులు చేశాడు.