ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీ ఉండటం గమనించి పలువురు అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందారు. ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “చేతికి పట్టీ ఉండటం గమనించి అభిమానులు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీ హోల్ సర్జరీ. ప్రస్తుతం నేను కోలుకున్నాను, నా దినచర్య సజావుగా సాగుతోంది. ఈ సర్జరీని ఎంతో నైపుణ్యంతో, సాఫీగా నిర్వహించిన అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు”అని అన్నారు.





