Sirimalli

My WordPress Blog

మార్చి 16నుంచి అసెంబ్లీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి 16 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మార్చి 16న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని తెలిపారు. మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంద నిన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సిఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా సాగింది. అనంతరం మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై స హచర మంత్రులతో కలిసి మంత్రి పొంగులేటి వెల్లడించారు.