మన తెలంగాణ/నాంపల్లి: నాంపల్లిలో ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమా దం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప లు కేసులకు సంబంధించిన కీలక ఫై ళ్లు మంటలకు ఆహుతి కావడం తీవ్ర క లకలం రేపుతోంది. నాంపల్లి పోలీస్ స్టే షన్ పక్కనే ఉన్న రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ భవనంలో శనివారం ఉదయం 10.20గంటలకు భవనంలో మొదటి అంతస్థులో హఠాత్తుగా మంటలు లేచాయి. పొగలు, మంటలు క్షణాల్లో వ్యాపించడంతో ఆఫీస్‌లో ఉన్న ఉద్యోగులు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీలక కేసుల డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, హర్డ్ డిస్క్‌లు, ముఖ్యమైన ఆధారాలు, పెన్ డ్రైవ్‌లు, రసాయనాల బ్యాట్రీలు, ఫర్నిచర్లు, కరెంట్ వైర్లు, ఫైళ్లు మంటల ధాటికి కాలి బూడిదయ్యాయి.
ప్రమాదం జరిగిన తీరుపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమదం జరిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. నాలుగు వైపుల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. కొందరు అద్దాలు ధ్వంసం చేసి పొగ బయటికి వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియగానే ఎసి గార్డ్ విద్యుత్ ఎడీఈ విజయకుమార్, ఇన్ఛార్జీ అసిస్టెంట్ ఇంజినీర్ మోహన్ బాబు తన సిబ్బందితో కలిసి ఫీడర్ లైన్ల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సచివాలయం, అసెంబ్లీ, లంగర్‌హౌస్ పలు చోట్ల నుంచి అదనంగా ఫైరింజిన్లను తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో అనేక కంప్యూటర్లు, కీలక ఫైళ్లు, ధ్రువపత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు, అగ్ని ప్రమాదాలకు సంబంధించిన కీలక ఆధారాలు, రికార్డులు, నేర నియంత్రణ దర్యాప్తు డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయని తెలిసింది. ల్యాబ్‌లో పరీక్షించిన ఆధారాలు,కోర్టులో ప్రవేశపెట్టాల్సిన కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయి. లక్షల రూపాయల సర్కార్ ఆస్తి మంటల్లో తగలబడిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
పక్కా ప్రణాళికతో జరిగిందా.. ప్రమాదమా?
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసులకు సంబంధించిన కీలక ఫైళ్లు ఉన్న కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం….ఫైళ్లు దగ్ధం కావడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు చెబుతున్నట్లుగా షార్ట్‌సర్కూట్‌తో ప్రమాదం జరిగినా అక్కడున్న సిబ్బంది మంటల ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు…? ఒక్కసారిగా మంటలు చెలరేగే అవకాశం లేకున్నా ఫైళ్లు ఫైళ్లను, డాక్యుమెంట్లను, ముఖ్యమైన రికార్డులను బయటకు ఎందుకు తీసుకువెళ్లలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కీలక మైన ఫైళ్లు ఉన్న కార్యాలయంలో ఇంత నిర్లక్షంగా ఉంటే ఎలా ? అని పలువురు మండిపడుతున్నారు.
విలువైన హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్లు మంటలకు ఆహుతి: దాస్, డిఎఫ్ఓ
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో మంటలు అదుపులోకి వచ్చాయని, మొదటి అంతస్థులో వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగిందని డీఎఫ్‌వో దాస్ తెలిపారు. విలువైన హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు , కీలక పత్రాలు కాలిపోయాయని .. రెండో అంతస్థులలోకి మంటలు వ్యాపించలేదన్నారు. సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వష్తువులు దగ్ధం , హార్డ్ డిస్క్‌లు పూర్తిగా కాలిపోయాయా… పాక్షికంగా దగ్ధమయ్యాయా అనేది పరిశీలించాల్సి ఉందన్నారు. నగర డీసీపీ శిల్పావల్లి సందర్శించి అగ్ని ప్రమాదానికి కారణాలు, ఎలా మంటలు వ్యాపించాయి అనే విషయాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. నష్టం ఎంత జరిగిందో తెలియదని, దర్యాప్తులో తేలుస్తుందన్నారు. వేసవి కాలం సీజన్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా సంబంధిత వ్యక్తులు ముందుస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అగ్ని మాపక శాఖ డీజీ విక్రం సింగ్ మాన్ పేర్కొన్నారు. తమ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. లోపల కంప్యూటర్లు, కీలక పత్రాలు, వస్తువులు, సామగ్రిలు అగ్ని కీలల తాకిడికి బుగ్గిపాలయ్యావని ఆయన పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదంపై అబద్ద ప్రచారం
ఖండించిన డిజిపి శివధర్ రెడ్డి
కీలక ఫైళ్లు భద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: నాంపల్లిలోని ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంపై జరుగుతున్న వదంతులను డిజిపి శివధర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇది కేవలం అగ్ని ప్రమాదం మాత్రమేనని, కీలక ఫైళ్లు దగ్గమయ్యాయన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఏదయినా ఫైలు అగ్ని ప్రమాదంలో కాలిపోయినా వాటికి బ్యాక్అప్ ఉంటుందని ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై జరుగుతన్న పుకార్లు నమ్మవద్దని ఆయనే పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక సాక్షాధారాలకు సంబంధించిన ఆధారాలు అగ్నికి ఆహుతయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డిజిపి స్పందిస్తూ అందులో వాస్తవం లేదని స్పష్టం చేయడం గమనార్హం.
‘ఓటుకు నోటు’ ఆధారాలు చెరిపేందుకే: కెటిఆర్ అనుమానాలు
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరగడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగులను, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేకపోవడాన్ని కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.





