Sirimalli

My WordPress Blog

ప్రేమ పెళ్లి కోసం తల్లి, సోదరుడిని కత్తితో పొడిచి చంపి… కాలువలో పడేశారు

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా జయపురం ప్రాంతంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పెళ్లికి అంగీకరించడంలేదని తల్లి, సోదరుడిని బాలిక చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బొరి గుమ్మంలో అనుష్క పరిఢా(45) అనే తల్లికి కూతురు(16), కుమారుడి(14)తో కలిసి నివసిస్తోంది. బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో పలుమార్లు హెచ్చరించింది. తన ప్రియుడిని ప్రేమ వివాహం చేసుకుంటానని తల్లికి చెప్పడంతో సోదరుడు, తల్లి అంగీకరించలేదు. ప్రేమపెళ్లి విషయంలో ఇద్దరితో కూతురు పలుమార్లు గొడవకు దిగింది. దీంతో ప్రియడితో కలిసి తల్లి, సోదరుడిని కత్తితో పొడిచి చంపింది. అనంతరం మృతదేహాలను కాలువలో పడేసింది. బాలుడి మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. అనుష్క మృతదేహం కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.