అమరావతి: టివి సౌండ్ తగ్గించామని అడిగినందుకు భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… షేక్ అహ్మద్ అనే యువకుడు(27) ఎసి మెకానిక్‌గా పని చేస్తున్నాడు. క్రాంతి అనే యువతితో ప్రేమలో పెట్టాడు. ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకొని మంగళగిరిలోని టిడ్కో ఇళ్లలో నివసిస్తున్నారు. క్రాంతి టివి సౌండ్ ఎక్కువగా పెట్టుకొని వీక్షిస్తోంది. సౌండ్ ఎక్కువగా కొంచెం తగ్గించాలని భార్యకు భర్త సూచించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్తాయికి చేరుకుంది. భార్య చెంపపై భర్త కొట్టాడు. కోపంతో రగిలిపోయిన భార్య కత్తి తీసుకొని భర్తను పొడిచింది. స్థానికుల వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.





