Sirimalli

My WordPress Blog

ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త బంధువుతో ఎఫైర్ పెట్టుకున్న మహిళ తన ప్రియుడితో కలిసి భర్త సందీప్‌ను దారుణంగా హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య మీనాక్షి, ఆమె ప్రేమికుడు గౌతమ్ కలిసి సందీప్‌ను నిద్రమాత్రలు ఇచ్చి, సుత్తితో కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం మృతదేహాన్ని బైక్ పై అడవిలో పారవేసేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు.

The post ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ appeared first on Navatelangana.