Sirimalli

My WordPress Blog

ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం

వర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వం లో, తన సోదరి పూజా శర త్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన మంచి సినిమా ఇదని తెలిపారు. డైరెక్టర్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమా ఫిమేల్ కంటెంట్ అని మరీ సందేశాత్మకంగా ఉండదు. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ బాస్, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, నిర్మాత పూజా శరత్ కుమార్ పాల్గొన్నారు.