Sirimalli

My WordPress Blog

పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆదివారం నిద్రమాత్రలు మింగి స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన సిబ్బంది ఆమెను వింజమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ వెంకట్రావు, ఇటీవల సస్పెన్షన్‌కు గురైన సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో మహిళా కానిస్టేబుల్‌కు ఎస్ఐతో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మహిళా కానిస్టేబుల్ వివరించారు.

The post పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.. appeared first on Navatelangana.