Sirimalli

My WordPress Blog

పంచుకుంటూ పోతే పైసా మిగలదు

న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఎన్నికల ఉ చితాల సంస్కృతిపై సుప్రీంకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక ప్రగతికి ముప్పుగా వాటిల్లే ఈ పద్ధతిని మానాలని పిలుపు నిచ్చింది. ఉచితాల విధానాలను ఇప్పటికైనా సమీక్షించుకుని తీరాలి. పద్ధతి మార్చుకోవాలని సంబంధిత పక్షాలకు హితవు పలికింది. ఉద్యోగావకాశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాలకు, విధాన నిర్ణేతలకు చురకలు పెట్టింది. తమిళనాడు విద్యుత్ పంపి ణీ సంస్థ తాము అందరికీ ఉచితంగా కరెంటు ఇస్తామని, ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుం డా ఈ సౌకర్యం కల్పిస్తామని ఇందుకు అనుమతించాలని ప్రతిపాదించింది. ఈ విషయం పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యా యమూర్తులు జాయ్‌మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీ ధర్మాసనం పలు రీతిలో ఈ సా మాజిక దుష్ప్రభావ అంశంపై స్పందించింది. పేదలకు చేయూత నిచ్చే సంకల్పాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్బాటాలకు దిగుతూ సాగే ఉచితాలకు పోవడం అర్థం కాని విష యం అని ధర్మాసనం తెలిపింది. ఇటీవలి కా లంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార ద శల్లో ఓట్ల వేటకు ఉచితాలకు దిగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలలో రెవెన్యూ లోటు భా రీగా ఉంది. అయితే ఇప్పటికీ దీనిని పట్టించుకోకుండా ఉచితాలకు దిగుతున్నారని విమర్శించారు. ఇటువంటి ఉచితాల దయార్థ్రత తో కూడిన ఉచిత విద్యుత్ పంపిణీతో చివరికి ఆర్థిక వ్యవస్థకు షాక్ కొట్టిస్తారా? అని ప్రశ్నించింది.

ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ కాదు , ఉద్యోగ కల్పన సంబంధిత రంగాల విస్తృతికి పాటుపడితే ప్రజలకు ఎప్పటికైనా మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు.తమిళనాడు విద్యుత్ సంస్థ ప్రతిపాదిత ఉచిత విద్యుత్ స్కీం గురించి వైఖరి తెలియచేయాలని కేంద్రానికి, ఇతర పక్షాలకు సుప్రీంకోర్టు నోటీసు వెలువరించింది. తమిళనాడు విద్యుత్ సంస్థ విద్యుచ్ఛక్తి సవరణల నిబంధన 2024ను సవాలు చేసింది. దీనిపై ధర్మాసనం స్పందించింది. దే శంలో ఎటువంటి సంస్కృతి నెలకొంటున్నదో తెలియడం లేదు. ప్రజల సంక్షేమం కోణంలో ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు. అయితే బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న వారికి దీనిని కల్పిస్తే బాగుంటుంది కానీ, మొదటికే మోసం గా మారకూడదు కదా? అని నిలదీశారు. ఎవరు బిల్లులు కట్టగలరు? ఎవరు కట్టలేరు? అనేది విశ్లేషించుకోకుండా, అందరికీ ఫ్రీ అంటే ఇది కేవలం తాయిలాల కిందికి రాదా? అని అడిగారు. ఎలక్ట్రిసిటీ టారీఫ్ వెలువడిన తరువాత ఈ ఉచిత స్కీం తీసుకువస్తామంటే దీని అర్థం ఏమిటని నిలదీశారు. రాష్ట్రాలు కానీ, సంస్థలు కానీ ముందుగా యువతరానికి అవసరం అయిన ఉద్యోగ ఉపాధి పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఉచిత తిండి, ఉచిత రవాణా, ఉచిత సైకిళ్లు , ఉచిత కరెంటు ఇస్తూ పోతే ఇక అంతా ఇంట్లో హాయిగా నిద్రపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో పని సంస్కృతి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఒక్క పనిచేస్తే సరిపోతుంది కదా? అభివృద్ధి పనులు ఆపివేసి, ఈ డబ్బుతో అందరికీ జీతాలు ఇస్తూ, వారి పట్ల ఔదార్యతను ప్రదర్శించండి. దీని వల్ల వారికి అప్పటికప్పుడు మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో దేశానికి ఏం అవుతుందనేది వదిలేస్తే మంచిదని వ్యంగ్యంగా తిట్టిపోసింది.