నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. ఇప్పటికే స్పీకర్‌కు తగినంత సమయం ఇచ్చామని స్పష్టం చేసిన ధర్మాసనం, అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
The post నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ appeared first on Navatelangana.






