నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెండ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అట్టహాసంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన అత్యంత సన్నిహితులు, దర్శకులు, స్నేహితులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. తరుణ్ భాస్కర్, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో పాటు రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ప్రత్యేక ప్రదర్శనలతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా కొనసాగాయి.
ఫిబ్రవరి 26 ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య సుముహూర్తంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. వేదమంత్రాల నడుమ పట్టు వస్త్రాల్లో విజయ్–రష్మికల జంట పెళ్లి తంతు పూర్తిచేయనుంది. అచ్చమైన తెలుగింటి సంప్రదాయ పద్ధతిలో ఉదయం వివాహం జరిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదే రోజు సాయంత్రం రష్మిక సొంత సంప్రదాయం అయిన ‘కొడవ’ (కూర్గ్) ఆచారం ప్రకారం మరోసారి పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. కూర్గ్ ప్రత్యేక దుస్తులు, ఆచారాలతో ఈ కార్యక్రమాన్ని అందంగా డిజైన్ చేశారు. రెండు కుటుంబాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ ప్లాన్ చేసిన ఈ డబుల్ వెడ్డింగ్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్‌లోని ఐటీసీ మెమంటోస్ ఉదయ్‌పూర్‌లో జరుగుతోంది. ఉదయ్‌పూర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్‌లో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
The post నేడు విజయ్-రష్మికల పెండ్లి వేడుక.. appeared first on Navatelangana.





