Sirimalli

My WordPress Blog

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్‌ ఉంటేనే అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. లేదంటే అస్సలు అనుమతించబోమని బోర్డు స్పష్టంచేసింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లను పరీక్షకు అనుమతిస్తారు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినా ఎంట్రీ ఉంటుంది. ఒక్క హాల్‌టికెట్‌ వెంట ఉంటే సరిపోతుంది. ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరంలేదు. బుధవారం ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలు జరుగనుండగా, గురువారం నుంచి సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తంగా 9.97లక్షల విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు.

The post నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం.. appeared first on Navatelangana.