నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.
The post నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి appeared first on Navatelangana.






