అమరావతి: తనకు, ఓ మహిళకు మధ్య జరిగింది వ్యక్తిగత విషయమని జనసేన ఎంఎల్ఎ అరవ శ్రీధర్ తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యానని, తన వాదనను కమిటీకి తెలిపానని, కమిటీ తన నివేదికను అధిష్టానానికి ఇచ్చాక నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరైన తరువాత శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఇది తన వ్యక్తిగత వ్యవహారమని, జనసేన పార్టీకి ఆపాదించవద్దని కోరారు. తనపై కేసు నమోదైన విషయం తనకు తెలియదని, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా చట్ట ప్రకారం ఎదుర్కోడానికి తాను సిద్ధంగా ఉన్నానని జనసేన ఎంఎల్ఎ అరవ శ్రీధర్ పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీ ప్రాంగణం నుండి సదరు మహిళకు వీడియో కాల్ చేసిన వీడియోను బాధితురాలు విడుదల చేయడంతో అది నిజామా? కాదా? ఎంఎల్ఎను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కమిటీకి అన్ని విషయాలు చెప్పానని, జనసేన పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాతే జనంలోకి వస్తానని వివరించారు.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల బాధితురాలు సదరు ఎంఎల్ఎ తో చనువుగా ఉన్న వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరగా సదరు ఎంఎల్ఎ నరకం చూపిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. శారీరకంగా తనను హింసించడని జనసేన ఎమ్మెల్యే బాధితురాలి వీడియో విడుదల చేసింది. పరిచయమైన రెండు రోజులకే తనని బెదిరించారని, తన కుమారుడు, తాను మాత్రమే ఉంటున్నానని జాగ్రత్త అని ఎంఎల్ఎ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. కడపకు వెళ్దామని కారులో తీసుకెళ్లి రాజంపేట వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, తన ప్రైవేట్ పార్ట్స్ తాకడంతో పాటు యువతి కారు డోరు ఓపెన్ చేయబోతే గట్టిగా కొట్టి తనపై అత్యచారం చేశాడని ఆరోపణలు చేసింది. ఆగస్టులో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని అబార్షన్ చేయించుకోవాలని ఎంఎల్ఎ ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకుంటానని ప్రామీస్ చేయడంతో అబార్షన్ చేసుకున్నానని, గత ఏడాదిన్నర కాలంలో ఐదుసార్లు అబార్షన్స్ చేశారని, తన భర్తకు కాల్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించారని, ఏడాదిన్నరగా తన సదరు ఎంఎల్ఎ తనని టార్చర్ చేశాని బాధితురాలు ఆరోపణలు చేసింది.





