దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. రాజక్క పేట గ్రామ శివారులో కాంగ్రెస్ నేత వంగ బాల్ రెడ్డిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డికి తన దాయాదులతో భూ తగాదాలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం రాజక్కపేట గ్రామ శివారులో బాల్ రెడ్డిపై దాడి చేసి అనంతరం గొంతు కోసి చంపేశారు. అనంతరం నిందితులు తల్లి, కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక దుబ్బాక ఆస్పత్రికి తరలించారు.





