Sirimalli

My WordPress Blog

త్రిపుర‌లో భారీ స్థాయిలో గంజాయి సాగు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: త్రిపుర‌లో భారీ స్థాయిలో గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. రూ.75 కోట్లు విలువ చేసే గంజాయి మొక్కల‌ను మంట‌ల్లో త‌గ‌ల‌బెట్టారు. ఫిబ్ర‌వ‌రి 1న సెపాహిజల జిల్లాలోని సోనామురా సబ్ డివిజన్ పరిధిలోని దులుంగా అటవీ ప్రాంతంలో పోలీసులు, సాయుధ ద‌ళాలు, బీఎస్ఎప్, త్రిపుర రాష్ట్ర రైఫిల్స్ పెద్ద ఎత్తున ఉమ్మడి ఆపరేషన్ నిర్వ‌హించాయి. ఈ దాడిలో దాదాపు 170 ఎకరాల అటవీ భూమిలో వేసిన‌ 92 ప్రత్యేక గంజాయి సాగు ప్లాట్లను బృందాలు గుర్తించి ధ్వంసం చేశాయి. అన్ని మొక్కలను అక్కడికక్కడే వేరు చేసి నాశనం చేశాయి. అధికారుల ప్రకారం, ధ్వంసం చేయబడిన నిషిద్ధ వస్తువుల అంచనా మార్కెట్ విలువ దాదాపు రూ. 75 కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. అక్రమ తోటల పెంపకంలో పాల్గొన్న వారిని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోంది.

The post త్రిపుర‌లో భారీ స్థాయిలో గంజాయి సాగు appeared first on Navatelangana.