Sirimalli

My WordPress Blog

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు (సోమ,మంగళవారం) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ జల్లులు కురుస్తున్నాయి. నేడు హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని, ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో వర్షం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు.

నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, , జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జిల్లాలలోనూ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా, సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి న భారీ వర్షాలు కురిశాయి. గంటకు 40 కి.మీ ఈదురుగాలుల వేగంతో వర్షాలు కురువడంతో కోతదశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా యి. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆదివారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది.

The post తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. appeared first on Navatelangana.