నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు దాదాపు 20 దేశాధినేతలను భారత్ ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేలు మాక్రాన్‌తో సహా పలు దేశాధినేతలంతా భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. బుధవారం మోడీ బిజిబిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.
షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ నేడు పలు దేశాల దేశాధినేతలతో సమావేశం కానున్నారు. దౌత్య మెగా మారథాన్‌లో భాగంగా హైదరాబాద్ హౌస్‌లో జరిగే సమావేశాల్లో స్పెయిన్, ఫిన్లాండ్, సెర్బియా, క్రొయేషియా, ఎస్టోనియా, భూటాన్, కజకిస్తాన్ దేశాల అగ్ర నాయకులతో మోడీ విడివిడిగా సమావేశం కానున్నారని వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం.. వీరిలో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి ఆంటి పెట్టేరి ఓర్పో, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్, క్రొయేషియా ప్రధాన మంత్రి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్, ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్, భూటాన్ ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టోబ్గే, కజకిస్తాన్ ప్రధాన మంత్రి ఓల్జాస్ బెక్టోనోవ్ ఉన్నారు.
ఫ్రెంచ్, బ్రెజిలియన్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతదేశ పర్యటనలో ఉన్నారు. వ్యూహాత్మక సహకారం, సాంకేతికత, వాణిజ్యం వంటి అంశాలపై ప్రధాన మంత్రి మోడీతో చర్చలు జరిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా కూడా శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ముఖ్య నాయకుల్లో ఉంటారని భావిస్తున్నారు.
The post ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్..నేడు పలు దేశాధినేతలతో మోడీ భేటీ appeared first on Navatelangana.





