Sirimalli

My WordPress Blog

ట్రంప్ చైనా పర్యటన ఖరారు

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారి ఒకరు శుక్రవారం అధికారికంగా పర్యటన తేదీలను ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, ఆర్థిక సంబంధాలను చక్కదిద్దడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇరు దేశాధినేతలు నేరుగా చర్చలు జరిపి కీలక అంశాలపై స్పష్టతకు రానున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో ఇరువురు నేతలు వాణిజ్య యుద్ధ విరమణకు తాత్కాలికంగా అంగీకరించారు. ఆ ఒప్పందాన్ని పొడిగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

The post ట్రంప్ చైనా పర్యటన ఖరారు appeared first on Navatelangana.