‘మన శంకర వరప్రసాద్ గారు’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ విజయంతో ఆయన తదుపరి చిత్రం ‘విశ్వంభర’పై అంచనాలు భారీగా పెరిగాయి. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్ పూర్తయినా వీఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమైంది. ఇటీవల చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ విశ్వంభర జూన్‌లో విడుదలయ్యే అవకాశముందని అన్నారు.
యూవీ క్రియేషన్స్‌కు చెందిన అజయ్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్‌లోని విఎఫ్ఎక్స్ కి మంచి స్పందన రాలేదు. అందుకే, రెండో టీజర్ లో పటిష్టమైన విఎఫ్ఎక్స్ ఉండేలా చూసుకున్నాం. విశ్వంభర ఒక పెద్ద సినిమా. అందుకే సీజీకి సమయం పడుతుంది. దీంతో సినిమా ఆలస్యమైన పర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీపడకూడదని నిర్ణయించుకున్నాము”అని తెలిపారు.
కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.





