కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్వకత్వంలో తెరకెక్కింది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్లాక్‌బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ .. “మృత్యుంజయ్’ పూర్తి థ్రిల్లర్‌గా నడుస్తుంది.
సాంగ్స్ లేకుండా, హీరోయిన్స్ లేకుండా, కామెడీ లేకుండా ఓ హానెస్ట్ థ్రిల్లర్‌లు మన తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. హుస్సేన్ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కంటెంట్‌ను తెలుగు వారికి అందించాలనే ఉద్దేశంతో సందీప్ ఈ మూవీని నిర్మించారు”అని అన్నారు. నిర్మాత సందీప్ గున్నం మాట్లాడుతూ ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో అద్భుతంగా నటించే హీరో కావాలని శ్రీ విష్ణుని తీసుకున్నాం. ఈ సినిమాకి కథే హీరో. కాళ భైరవ తన సంగీతంతో అద్భుతం చేశాడు”అని తెలియజేశారు.






