నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో చర్చించనుంది. ఉ.10.30 నుంచి మ.2 గంటల వరకు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన 10 మంది సభ్యులు ఈ అంశంపై మాట్లాడనున్నారు. గొంతునొప్పి కారణంగా నిన్న సభకు హాజరుకాని డిప్యూటీ సీఎం పవన్ కూడా నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. మ.12.30 నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడి చివరలో ఓ ప్రకటన విడుదల చేస్తారు.
The post కల్తీ నెయ్యిపై నేడు ఏపీ అసెంబ్లీలో చర్చ appeared first on Navatelangana.





