Sirimalli

My WordPress Blog

ఔటర్ రింగ్ రోడ్డుపై గాల్లోకి ఎగిరిపడిన కారు: ఇద్దరు మృతి

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పోతారం ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అతి వేగంతో ఓఆర్‌ఆర్‌పై నుంచి సర్వీసు రోడ్డు పడడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నడుములకు తీవ్ర గాయాలు కావడంతో వారు నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఏడుగురు ప్రయాణికులు హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ నుంచి బాచుపల్లికి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.