Sirimalli

My WordPress Blog

ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం.. రైతన్న, నేతన్న సేఫ్

వాషింగ్టన్ /న్యూఢిల్లీ : భారత్ అమెరికా మధ్య అ త్యంత కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు అయింది. పూర్తి సమగ్ర స్థాయి వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుకు సంబందించి ఇరుదేశాలూ శనివారం సంయుక్త ప్రకటన వెలువరించాయి. ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరమైన ట్రేడ్ డీల్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించుకున్నారు. దీని మేరకు రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు ఇనుమడించేందుకు వీలేర్పడుతుంది. ఉభయపక్షాలు దిగుమతి సుంకాలను తగ్గించుకుంటాయి. ఇప్పటి మధ్యంతర వాణిజ్య ఒప్పం దం ఖరారుతో భారతీయ ఎగుమతిదార్లకు 30 ట్రిలియ న్ డాలర్ల మేర మార్కెట్ ఏర్పడుతుంది. ఒప్పందంలో భా గంగా అమెరికా ముందుగా భారతీయ సరుకులపై ఇం తకు ముందటి 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తుంది. ఇక భారతదేశం అమెరికా పారిశ్రామక ఉత్పత్తు లు, ఆ దేశానికి చెందిన పలు ఆహార వ్యవసాయ సరుకులు వంటి వాటిపై

దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేయడం లేదా, గణనీయంగా తగ్గించడం జరుగుతుంది. ఆహార ఉత్పత్తుల్లో డ్రైడ్ డిస్టిలరీస్ గింజలు, పశువుల దా ణాకు వినియోగించే ఎర్రజొన్న , ట్రీనట్స్, తాజా, ప్రాసిసిడ్ పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్‌కు కూడా మినహాయింపులు ఉంటాయి.ఇప్పుడు విడుదల చేసిన సంయుక్త ప్రకటన మేరకు భారతదేశం అమెరికా నుంచి ఈ దేశ ఇంధన ఉత్పత్తులు, విమానాలు, వాటి విడిభాగా లు, విలువైన లోహాలు, సాంకేతిక పరికరాలు, కుకింగ్ కోల్, వంటివి వచ్చే ఐదేండ్లలో 500 బిలియన్ డాలర్ల విలువ మేరకు కొనుగోలు చేస్తుంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం విధివిధానాలను ప్రకటిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇప్పటి ఒప్పందం ఖరారు నేపథ్యంలోనే అ మెరికా అధ్యక్షులు ట్రంప్ భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాల్లో పాతిక శాతం వరకూ తగ్గించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. తాము పేర్కొన్నట్లు భారతదేశం గణనీయంగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తూ వస్తున్నందున ప్రతీకార సుంకాలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్ ఫిబ్రవరి 7వ తేదీ , 2026 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు.

రైతుల ప్రయోజనాలకు ప్రాదాన్యత : కేంద్రం

ఇప్పుడు కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం పరిధి లో రైతుల ప్రయోజనాలకు హాని జరగకుండా చర్యలు తీ సుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యా లు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు , జున్ను, ఇథనాల్, కూరగాయలు, మాంసంపై ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని వెల్లడించారు.