Sirimalli

My WordPress Blog

ఆ మిస్ ఇండియా ఫైనలిస్ట్ తో ఇషాన్ పెళ్లి: తాతయ్య

హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ కు ఇష్టమైన యువతినే పెళ్లి చేసుకుంటాడని అతడి తాతయ్య రామ్ అనురాగ్ పాండే తెలిపారు. టి20 వరల్డ్ కప్ తరువాత ఇషాన్ వివాహం జరిపిస్తామన్నారు. ఆయన మీడియతో మాట్లాడారు. ఇషాన్ కిషన్ సోదరుడికి లవ్ మ్యారేజ్ చేశామని, అదే విధంగా ఇషాన్ కూడా లవ్ మ్యారేజ్ చేయడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. గర్ల్ ఫ్రెండ్ అదితి హుందియాతోనే ఇషాన్ ప్రేమలో ఉన్నాడని, వారికి వివాహం చేస్తామన్నారు. ఆమె మోడల్‌గా రాణించడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో ఉన్నారని అనురాగ్ కొనియాడారు.

తన మనవడు ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడాలని తన కుటుంబం కోరుకుంటుందని, అందుకోసం దేవుడిని ప్రార్థిస్తామని, పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందు అభిషేక్ శర్మ-ఇషాన్ కిషన్ ఒకటే అడిగానని, తొలి పది ఓవర్లలో వంద పరుగులు చేస్తే పాక్‌పై ఒత్తిడి పెరుగుతుందని సలహా ఇచ్చానన్నారు. పాక్‌పై ఇషాన్ హాఫ్ సెంచరీ చేయడంతో కాస్త రిలాక్స్ అయ్యామని తెలియజేశారు. పాక్‌పై భారత్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. టి20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలువాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అదితి హుందియా ఎవరు అంటే ఆమె రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు. ఆమె పేరుమీదనే ఓ ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్‌లో ఉంది. 2019 నుంచి అదితి, ఇషాన్ ప్రేమలో ఉన్నారు.