ప్రేమలో మునిగితే అంతే.. త్రిష పోస్ట్ వైరల్

Trisha

స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్ల కావొస్తున్నా ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే త్రిష గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ఆమె పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ హీరోతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ చెప్పడం.. దాన్ని ఆమె తల్లి షేర్ చేస్తూ.. హార్ట్ సింబల్ జోడించడంతో ఈ వార్తలకు ఊతాన్నిచ్చాయి.

అయితే తాజాగా త్రిష (Trisha) పెట్టిన స్టోరీ ఆమె ప్రేమలో ఉన్నారనే విషయాన్ని మరింత బలపరుస్తోంది. ‘ప్రేమలో మునిగితే అది కొందరిని తికమక చేస్తుంది’ అంటూ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. దీంతో త్రిష ప్రేమలో ఉన్నారనే విషయాన్ని ఈ స్టోరీ స్పష్టం చేస్తోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు పెళ్లి గురించి రూమర్స్ వచ్చిన త్రిష వాటిని ఖండిస్తూ వచ్చింది. తను పెళ్లి చేసుకుంటే అధికారికంగా ప్రకటిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ప్రేమ గురించి స్టోరీలు పెట్టడం చూస్తే.. త్వరలోనే ఆమె నుంచి ప్రకటన వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కాగా, ఈ ఏడాది త్రిష చేతి సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఐడెంటిటీ, గుడ్‌ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి సినిమాలతో ఆమె ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాలు చేస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు నత్తనడకలా : ఈటల

Etala Rajender fire BRS

హైదరాబాద్: దమ్ము, ధైర్యం లేక తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఎంపి ఈటల రాజేందర్ మండిపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు నత్తనడక సాగుతోందని, బిజెపి, కాంగ్రెస్( BJP, Congress) మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వేగం లేదని అన్నారు. ప్రభాకర్ రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సిఎం కెసిఆర్ కోసం పని చేశారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.

బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరో శ్రీరామ్ అరెస్ట్

Hero Sriram

చెన్నై: తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (Hero Sriram). అయితే శ్రీరామ్ తాజాగా చిక్కుల్లో పడ్డారు. డ్రగ్స్‌ కేసులో ఆయన్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎఐఎడిఎంకె కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుండి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రక్త నమూనాలు సేకరించారు.

చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ పోలీసులు శ్రీరామ్‌ను (Hero Sriram) నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి రెండు గంటలుగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రసాద్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీరామ్ అరెస్ట్ తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు: రోజా

RK Roja fire chandra babu naidu

అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కు వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని  మాజీ మంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. సింగయ్య చనిపోవడంతో కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే కుట్రలు, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.  ఆమె మీడియాతో మాట్లాడుతూ..18న జగన్ కాన్వాయ్ ముందు చనిపోయారంటూ ఎస్పి చెప్పారని, 22న అదే ఎస్పి చేత అబద్ధం చెప్పించారని చెప్పారు. నిజమైతే డ్రైవర్ పై కేసు (Case driver)  పెట్టాలి కానీ జగన్ పై పెట్టడమేంటీ అని అన్నారు. విమానం కూలిన ఘటనపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ పై ఎందుకు కేసు పెట్టలేదు? అని ప్రశ్నించారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై హోం మంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అన్నారు. బైక్ స్టంట్ లు చేయాలన్న పవన్ మాటలు విని ఇద్దరు చనిపోయారని, మరి పవన్ కల్యాణ్ పై ఎందుకు కేసులు పెట్టలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని రోజా పేర్కొన్నారు.

బౌలర్లను ఉతికేసిన వాషింగ్టన్ బ్యాటర్లు.. ఎంపిఎల్‌లో హిస్టారికల్ విక్టరీ

Mitchell Owen

డల్లాస్: మేజర్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. సోమవారం టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ ఫ్రాంచైజీకి చెందిన బ్యాటర్ మిచెల్ ఓవెన్ (Mitchell Owen) ఆల్ రౌండ్ ఫర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. మొదట బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన ఓపెన్ ఆ తర్వాత బ్యాటింగ్‌లో 89 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. ఓవెన్‌తో (Mitchell Owen) పాటు.. అండ్రీస్ గౌస్ (80) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో ఎంపిఎల్ ఛరిత్రలోనే అతి భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా వాషింగ్టన్ రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. కెప్టెన్ డుప్లెసిస్ (69) అర్థ శతకంతో, స్టోయినిస్ 32, మిలింద్ కుమార్ 31 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ ఓవెన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

3 నెలల నుంచి సఫాయి కార్మికులకు జీతాలు అందట్లేదు: హరీష్ రావు

Harish Rao comments Revanth Reddy

హైదరాబాద్:  ట్రాక్టర్ల లో డిజిల్ పోయలేకనే… గ్రామాల్లో చెత్త సేకరించట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. .ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు అందట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంట్రాక్టర్లు 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తే బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పారు.సఫాయి కార్మికులు కమీషన్ ఇవ్వలేరు కాబట్టి జీతాలు ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి (Hyderabad – Delhi) వెళ్లేందుకే సిఎం రేవంత్ రెడ్డి కు సమయం సరిపోతుందని చురకలంటించారు. నెలకోసారి కూడా సిఎం సచివాలయానికి వెళ్లట్లేదని హరీష్ రావు దుయ్యబట్టారు.

ఎంపి రఘునందన్‌‌రావును చంపేస్తామంటూ బెదిరింపు కాల్

Raghunandan Rao

హైదరాబాద్: బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు (Raghunandan Rao) బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన్ను సాయంత్రంలోగా చంపేస్తామంటూ పీపుల్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్‌ కాల్‌ను రఘునందన్‌రావు పిఎ ఎత్తాడు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని ఆగంతకుడు చెప్పాడు. దమ్ముంటే కాపాడుకోండని రఘునందన్‌ను అతడు బెదిరించాడు.

మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపి రఘునందన్‌ (Raghunandan Rao) పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రఘునందన్‌ రావు అప్రమత్తమై తెలంగాణ డిజిపి జితేందర్‌, సంగారెడ్డి ఎస్పి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ 912143352974 అనే నెంబర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎంపి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ వచ్చిన నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీపై గంగూలీ ఆసక్తికర కామెంట్స్

Sourav Ganguly

కోల్‌కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి (Sourav Ganguly) దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన కెప్టెన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు భారత్‌ జట్టుకు ఆ తర్వాత కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. అందుకే గంగూలీ అంటే క్రికెట్ అభిమానుల్లో అంత క్రేజ్ ఉంటుంది. అయితే గంగూలీ రాజకీయ ఆరంగేట్రంపై చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రతీసారి ఆయన వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు.

తాజాగా మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి గంగూలీని (Sourav Ganguly) ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైనా పార్టీలో చేరుతారా అని పిటిఐ ఇంటర్వ్యూలో గంగూలీని ప్రశ్నించగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అయితే ‘ఒకవేళ సిఎం పదవి ఇస్తామని హామీ ఇస్తే’ అని కూడా ఆయన్ను అడగగా ‘నాకు ఆసక్తి లేదని గంగూలీ అన్నారు.

జగన్ పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారు: గొట్టిపాటి

Gottipati Ravikumar comments jagan

అమరావతి: ప్రజల్లో ఆదరణ ఉందని చూపడం కోసం ఎపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అమాయకులను బలిగొంటున్నారని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తన పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో డబ్బు(Money betting) పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి…మరో రెండు నిండు ప్రాణాలు బలితీసుకున్నారని విమర్శించారు. వాహనం ఢీకొన్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే సింగయ్య ప్రాణం నిలబడేదని ఆవేదనను వ్యక్తం చేశారు. చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని గొట్టిపాటి రవికుమార్ దుయ్యబట్టారు.

తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు: భూమన

Uncontrolled liquor sales

అమరావతి: తిరుపతిలో తెల్లవారుజాము నుంచే మద్యం షాపులు తెరుస్తున్నారని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల పాటు మద్యం విక్రయిస్తున్నారని రూల్స్ కు విరుద్ధంగా (Against rules) నడుస్తున్న మద్యం అమ్మకాలపై చర్యలేవి? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలపై ఆందోళన చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.