డబ్ల్యూటిసి చరిత్రలో ఒకేఒక్కడు.. ట్రావిస్ హెడ్ నయా రికార్డు

Travis Head

బార్బడోస్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. విండీస్‌ని చిత్తు చేసి 159 పరుగుల భారీ తేడాతో ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హెడ్ 59, 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

దీంతో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న హెడ్ (Travis Head).. డబ్ల్యూటిసి చరిత్రలో 10 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 50 మ్యాచుల్లోనే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటిసి ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న హెడ్ మొత్తం 50 మ్యాచుల్లో 3,233 పరుగులు చేశాడు. ఇక డబ్ల్యూటిసిలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో హెడ్ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్, జో రూట్ ఉన్నారు. వీరిద్దరు చెరి ఐదు సార్లు ఈ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలోనూ ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నాడు. అతను నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ పుస్తకం కాశీలోని అనేక పార్శ్వాలను సృశించింది: వెంకయ్య నాయుడు

great police officer good book

హైదరాబాద్: పోలీసు అధికారిగా ఉండి మంచి పుస్తకం రాయడం గొప్ప విషయం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. కిల్లాడ సత్యనారాయణ రచించిన పుస్తకం ‘బహుముఖ బనారస్’ ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా అయోధ్య ఆలయ జ్ఞాపికను సత్యనారాయణ ఆయనకు అందించారు.  వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..ఈ పుస్తకం కాశీలోని అనేక పార్శ్వాలను సృశించిందని అన్నారు. మన సంస్కృతిలో స్త్రీలకు గొప్ప ప్రాధాన్యం ఉంది అని చెప్పారు. యువతలో మార్పు రావాలని, సామాజిక, సాంస్కృతిక (Social cultural) పునర్ వైభవం సాధించాలని సూచించారు. హిందూ అనేది జీవన విధానం అని సంపద, జనాభా, విజ్ఞానం ఉన్న దేశం మనది అని పేర్కొన్నారు. ఇలాంటి పుస్తకాలు వికసిత భారత్ కు తోడ్పడతాయని ఆశిస్తున్నానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

గజరాజుల బీభత్సం.. జగన్నాథ రథయాత్రలో అపశృతి

Jagannath Rathyatra

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్రలో (Jagannath Rathyatra) అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు అదుపుతప్పి భక్తులపైకి దూసుకు వచ్చాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. అయితే కొంత సమయానికి పరిస్థితి అదుపుకావడంతో మళ్లీ రథయాత్రను యథావిధిగా జరిపించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10.15 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్ర (Jagannath Rathyatra) అహ్మదాబాద్‌లోని ఖాదియా ప్రాంతం నుంచి వెళ్తుండగా.. ఏనుగులు అదుపు తప్పాయి. దీంతో కొంత సమయం గందరగోళ పరిస్థితి నెలకొంది. భారీ శబ్ధంలు రావడం వల్లే ఏనుగులు బెదిరి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

మంత్రి పదవి రావడం కొందరు తట్టుకోలేకపోతున్నారు: సీతక్క

Sitakka fire BRS

హైదరాబాద్: కొన్ని రాజకీయ పార్టీలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు మావోయిస్టుల లేఖపై సీతక్క స్పందించారు. లేఖ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిందా లేదా అంశంపై స్పష్టత లేదని చెప్పారు. తనకు మంత్రి పదవి  రావడాన్ని కొందరు తట్టకోలేకపోతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు చాలా కుట్రలు చేశారని, గిరిజనులను చిత్రహింసలకు (Tribals tortured) గురిచేసిన పార్టీ బిఆర్ఎస్ అని సీతక్క మండిపడ్డారు.

కోల్‌కతాలో మరో దారుణం.. లా విద్యార్థినిపై సమూహిక అత్యాచారం

Kolkata

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో(Kolkata) మరో దారుణం చోటు చేసుకుంది. ఆర్జీకర్ ఆస్పత్రికలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణం మరువక ముందే మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కస్బాలోని సౌత్ కోల్‌కతా (Kolkata) లా కళాశాలలో ఈ నెల 25వ తేదీన ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ రూంలో బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. వారిలో ఇద్దరు సిబ్బంది కాగా, మరొకరు పూర్వ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై కేసు నమోదు కాగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

పెళ్లికి నిరాకరించిందనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాల వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. మరో ఇద్దరు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) అని తెలుస్తోంది. నిందితులకు ప్రస్తుతం ఐదు రోజుల కస్టడీ విధించారు. ఈ ఘటనపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ పాలనలో ఆడవాళ్లకు భద్రత కరువైందని.. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని బిజెపి నేత అమిత్ మాలవీయా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

నిపుణులు నివేదిక ఇచ్చినా.. రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదు: కెటిఆర్

Manjira Barrage danger

హైదరాబాద్: మంజీరా ఆఫ్రాన్ కొట్టుకు పోయిందని, స్పిల్ వే దెబ్బతిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు చేతకాని తనంతో మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..మార్చి 22 న నిపుణులు మంజీరా బ్యారేజీని (Manjira Barrage) సందర్శించారని, మంజీరా దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని తెలియజేశారు. పిల్లర్లు, ఆఫ్రాన్, స్పిల్ వే పై నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని, నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదని విమర్శించారు. మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలను వెంటనే రిపేర్ చేయించాలని చెప్పారు. మంజీరాపై కాంగ్రెస్, బిజెపి నేతలు స్పందించకపోవడం దారుణమని కెటిఆర్ పేర్కొన్నారు.

‘అన్న ఇలా చేస్తాడని అనుకోలేదు’..కన్నప్పపై మనోజ్ రియాక్షన్

Manchu Manoj

హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ చిత్రం ‘కన్నప్ప’. శుక్రవారం (జూన్ 27)న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను చూసిన మంచు మనోజ్ (Manchu Manoj) అనూహ్యమైన రియాక్షన్ ఇచ్చారు. సినిమాను ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా బాగుందని చెప్పారు. తాను అనుకున్న దాని కంటే వెయ్యి రేట్లు బాగా వచ్చిందని.. చివరి 20 నిమిషాలు అదిరిపోయాయన్నారు.

ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా మరో రేంజ్‌కి వెళ్లిందని.. ప్రభాస్ యాక్టింగ్ అదిరిపోయిందని మనోజ్ (Manchu Manoj) పేర్కొన్నారు. అన్న (విష్ణు) ఇంత బాగా చేస్తారని అస్సలు ఊహించలేదని తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని అశిస్తున్నానని అన్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనని భావోద్వేగానికి గురి చేశాయని.. ఇక తన తండ్రి మోహన్‌బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఏడాదికి ఎపిఎండిసిపై రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది : జగన్

jagan comments chandra babu naidu

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని వైఎస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై మండిపడ్డారు. అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎపిఎమ్ డిసి ద్వారా మళ్లీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, రూ.5, 556 కోట్లకు బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని విమర్శించారు. గతంలోనే హై కోర్టు ప్రభుత్వానికి నోటీసులు (High Court notices government) జారీ చేసిందని, అయినప్పటికీ ఎపిఎండిసి ద్వారా మళ్లీ అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్ బిఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా.. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలే.. నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిందని చెప్పారు. రూ. 9వేల కోట్ల అప్పుల కోసం ఎపిఎండిసికి చెందిన రూ.1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టడం దారుణమని, దీంతో ఎపిఎండిసిపై ఏడాదికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో బాబు చెప్పాలని జగన్ ప్రశ్నించారు.

జూరాలకు వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: కెటిఆర్

Precautions damage Jurala project

హైదరాబాద్: ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రమాదంలో పడిందని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. జూరాల రోప్ 9వ నంబర్ గేట్ తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయలేదని, మెయింటెనెన్స్ పనులు (Maintenance work) చేయించడంలో నిర్లప్తత స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూరాలకు వరద ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ కోరారు.

పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి… కానీ మనకే పసుపు బోర్డు: కిషన్ రెడ్డి

Revanth Reddy proven colluded BRS

హైదరాబాద్: నిజామాబాద్ ప్రజలు గర్వించాల్సిన సమయం ఇది అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. పసుపు బోర్డు లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న పసుపు బోర్డు ఆఫీస్ (Yellow board office) ను హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని, పలు రాష్ట్రాలు కోరినా కేంద్రం నిజామాబాద్ కే బోర్డు కేటాయించిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని, ట్యాపింగ్ చేసింది పోలీసులే కాబట్టి సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ తో సిఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పోలీసులపై పోలీసులే దర్యాప్తు జరిపే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు.