100 కోట్లతో రోడ్డు.. కానీ, మధ్యలో చెట్లను అలాగే వదిలేసి..

Bihar Road

జెహానాబాద్: కొత్తగా నిర్మించిన రోడ్డుపై ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి గుంతలు లేకుండా రోడ్డుకు ఇరువైపుల ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ఆవే చెట్లు రోడ్డు మధ్యలో ఉంటే.. ఆ ప్రయాణం గందరగోళంగా మారుతుంది. బిహార్ రాజధాని పాట్నాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెహానాబాద్‌లో ఇలాంటి రోడ్డునే (Bihar Road) నిర్మించారు. పాట్నా నుంచి గయాకు వెళ్లే మార్గంలో 100 కోట్లతో 7.48 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్డు నిర్మాణంలో చెట్లను అలాగే వదిలేశారు.

అసలు కారణం ఏంటంటే.. జిల్లా యంత్రాంగం ఈ రోడ్డు (Bihar Road) నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. అయితే చెట్లను తొలగించడానికి అటవీ శాఖను వాళ్లు సంప్రదించారు. కానీ అటవీ శాఖ అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ చెట్లు తొలగిస్తే.. 14 హెక్టార్ల భూమిని పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ డిమాండ్‌ను పూర్తి చేయలేకపోయిన అధికారులు ఈ విచిత్రమైన పనికి పూనుకున్నారు. రోడ్డుపై ఉన్న చెట్లు ఒక వరుసలో ఉన్నా బాగుండేది.. కానీ, అవి గజిబిజిగా ఉన్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడంగా మారింది. ఇప్పటికే ఈ రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయని ఓ వ్యక్తి తెలిపారు. అయితే ఈ రోడ్డును పునరుద్దరించకపోతే పెను ప్రమాదం జరిగి ఎవరి ప్రాణాలైనా పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆధారాలు లేకుండా రాస్తే చర్యలు కఠినంగా ఉంటాయి: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy comments Revanth Reddy

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఏం సంబంధం? అని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. పథకం ప్రకారం కెసిఆర్ కుటుంబంపై కక్షసాధింపు జరుగుతోందని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏ విచారణ అధికారైనా కెసిఆర్, కెటిఆర్ పేరు చెప్పారా? అని ఫోన్ ట్యాప్ (Phone tap) చేశారని ఏ అమ్మాయైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఊహించి రాసి ఇదే జర్నలిజం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా రాస్తే తమ చర్యలు కఠినంగా ఉంటాయని, దుష్ప్రచారంపై కెసిఆర్ ఊరుకున్నా తాము ఊరుకోం? అని ధ్వజమెత్తారు. దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగడం లేదా? అని ఇప్పుడు ట్యాపింగ్ జరగట్లేదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

‘బిగ్‌బాస్’ అభిమానులకు గుడ్‌న్యూస్.. మీరు కూడా పాల్గొనవచ్చు

Bigg Boss 9

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9) త్వరలో ప్రారంభంకానుంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ‘చదరంగం కాదు.. ఈసారి రణరంగం’ అంటూ ఈ 9వ సీజన్‌ని నాగార్జన పరిచయం చేశారు. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు పాల్గొనే అవకాశం కల్పించారు. ‘‘ఇప్పటివరకూ బిగ్‌బస్ షోను మీరు ఎంతగానో ప్రేమించారు. ఇంత ప్రేమ ఇచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమివ్వాలి? సెలబ్రిటీలే కాదు. మీకు అవకాశం ఉంది. వచ్చేయండి.. బిగ్‌బాస్9 తలుపులు మీకోసం తెరిచి ఉంటాయి’’ అని నాగార్జను పేర్కొన్నారు. బిగ్‌బాస్ 9లో పాల్గొనాలంటే bb9.jiostar.com వెబ్‌సైట్‌కి వెళ్లి.. రిజిస్టర్ అయి.. ఆ షోటో మీరు పాల్గొనడానికి గల కారణాన్ని తెలుపుతూ ఓ వీడియోని అప్‌లోడ్ చేయాలి. మీ వీడియో నచ్చితే బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది.

విద్యావ్యస్థలో దారుణ పరిస్థితులకు ఇది మరో నిదర్శనం: జగన్

jagan comments Nara Lokesh

అమరావతి: ఎపిలో విద్యావ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan MohanReddy మండిపడ్డారు. విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి..ఎపి ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నాఇప్పటికి కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని విమర్శించారు. రేపటి నుంచి..బిటెక్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు.

ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు (Polytechnic students)ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. మే 15న ఫలితాలు వచ్చినా, ఇప్పటికి కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ లేదని, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని అన్నారు. విద్యావ్యస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం అని ఎద్దేవా చేశారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అని జగన్ దుయ్యబట్టారు.

పసుపుబోర్డు సాధించిన నిజామాబాద్ రైతులు: బండి సంజయ్

Nizamabad achieved yellow board

హైదరాబాద్: ఎంతో పోరాటం చేసి నిజామాబాద్ పసుపుబోర్డు సాధించిందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. పసుపుబోర్డు (yellow board) సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలియజేశారు. పసుపుబోర్డు ఇచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బిజెపికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇంగ్లండ్‌తో ఫలితం ఎలా ఉన్నా.. గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించండి: రవిశాస్త్రి

Ravi Shastri

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభ్‌మాన్‌ గిల్‌కి ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓటమిపాలైంది. బ్యాటర్‌గా గిల్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. టీం ఇండియాను మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో గిల్‌ కెప్టెన్సీపై పలువురు విమర్శలు చేశారు. కొందరు మాత్రం అతనికి మద్ధతుగా నిలిచారు. ఆ జాబితాలో టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కూడా చేరారు. ఇంగ్లండ్‌తో సిరీస్ ఫలితం ఎలా ఉన్నా గిల్‌ని కెప్టెన్‌గా కొనసాగించాలని ఆయన కోరారు.

శుభ్‌మాన్ గిల్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయని శాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు.. టాస్ వేసే సందర్భంలో ఎంతో పరిణితి ప్రదర్శిస్తున్నాడని కితాబిచ్చారు. ‘‘గిల్‌ను మూడేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగించాలి. ఇంగ్లండ్ సిరీస్ ఫలితం ఎలా ఉన్నా.. మార్పు చేయవద్దు. అతను కచ్చితంగా టీమ్ ఇండియాను విజయాల బాటలో నడిపిస్తాడు. గొప్ప క్రికెటర్‌కి కావాల్సిన అన్ని లక్షణాలు గిల్‌లో ఉన్నాయి. అతను పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకోగలిగితే గొప్ప ఆటగాడిగా నిలుస్తాడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ జూలై 2వ తేదీ నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం అవుతుంది.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: చంద్రబాబు

three parties coordination

అమరావతి: విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ప్రజలకు చెప్పామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు  (Chandrababu Naidu) తెలిపారు. మూడు పార్టీలు ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో తాము ఏం చేయాలనే దానిపై ఇప్పటికే చర్చించాం అని ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ అఖండ విజయం (huge success) సాధించామని చెప్పారు. ప్రజలు పెట్టిన ఆకాంక్షలను తాము కాపాడుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం మన బాధ్యత అని తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై కెటిఆర్ ఫైర్

Renaming Annapurna canteens

హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రూ.5 భోజనం ‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై మండిపడ్డారు. ఢిల్లీ బాసులకు విధేయత (Loyalty Delhi bosses) కోసం వాళ్ల పేరును మార్చుకోవచ్చు కదా? అని ఎద్దేవా చేశారు. వాళ్ల పేరును రాజీవ్ లేదా జవహర్ గా ఎందుకు మార్చుకోకూడదు? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ అర్థరహిత చర్యలన్నింటినీ రద్దు చేస్తాం అని కెటిఆర్ పేర్కొన్నారు.

చంద్రబాబు బనకచర్ల అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు: శ్రీకాంత్ రెడ్డి

Srikanth Reddy comments chandra babu

అమరావతి: సంక్షేమాన్ని గాలికొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి పేరుతో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటికే లక్షా 60 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చారు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని, రాయలసీమ ప్రజలను ఊరించడానికే బనకచర్ల ప్రాజెక్టు అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

పాకిస్థాన్‌లో దారుణం.. 16 మంది జవాన్లు మృతి

Suicide Attack

పాకిస్థాన్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Attack) 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు. ఈ దాడిలో పౌరులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో ఉగ్రవాది సైనికుల కాన్వాయ్ పైకి దూసుకెళ్లాడు. దీంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు పిల్లలు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత తీసుకుంటూ ప్రకటన చేసింది.