ఇంకా దొరకని విమానం బ్లాక్ బాక్స్‌.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పుడు బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది?.. ఘటన సమయంలో విమానంలో ఏం జరిగిందో తెలియాలంటే బ్లాక్ బాక్స్ చాలా అవసరం. కానీ ఇప్పటివరకు అది దొరకలేదు. బ్లాక్ బాక్స్ దొరికిందని వస్తున్న వదంతులను ఎయిర్ ఇండియా కొట్టిపారేసింది. ఏం జరిగిందనే దాని గురించి కీలకమైన సమాచారాన్ని అందించే విమానం బ్లాక్ బాక్స్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని.. దానికోసం ఘటనాస్థలంలో సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఇప్పటికే దర్యాప్తు బృందం సంఘటనాస్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది. శుక్రవారం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన ప్రధాని అనంతంరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించారు. తర్వాత ఈ ఘటనపై అధికారులతో సమావేశమై సమీక్షించారు. కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 297కు చేరుకుంది.

ఐపిఎల్‌లో అన్‌సోల్డ్.. క్రిస్‌ గేల్ రికార్డు బద్దలుకొట్టిన కివీస్ ఓపెనర్

Finn Allen

కాలిఫోర్నియా: అమెరికాలో జరుగుతున్న మేజర్ క్రికెట్ లీగ్-2025లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఆలెన్ (Finn Allen) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లీగ్‌లో సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆలెన్ శుక్రవారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 296 స్ట్రైక్‌ రేటుతో కేవలం 51 బంతుల్లో 151 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లుతో పాటు.. ఏకంగా 19 సిక్సులు బాదాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను బద్దలు కొట్టాడు. కేవలం 49 బంతుల్లోనే 150 పరుగుల స్కోర్ దాటి.. టి-20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగుల స్కోర్ దాటిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. 34 బంతుల్లోనే ఆలెన్ బాదిన శతకం టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత వేగంవంతమైన సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన కివీ క్రికెటర్‌గా కూడా ఫిన్ అలెన్ నిలిచాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని నెలల క్రితం ఐపిఎల్ వేలంలో ఫిన్ ఆలెన్‌ని (Finn Allen) కూడా రూ.2కోట్ల బేస్ ధరకి వేలం వేశారు. కానీ, అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఇప్పుడు అతని మేజర్ క్రికెట్ లీగ్‌లో సంచలనం సృష్టించాడు. అంతేకాక, ఇక టి-20 ఇన్నింగ్స్‌లో 19 సిక్సులు కొట్టి ఆలెన్ క్రిస్‌గేట్ రికార్డును బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో గేల్ ఓ మ్యాచ్‌లో 18 సిక్సులు కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆలెన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో యూనికార్న్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్‌ 13.1 ఓవర్లలో 146 పరుగలకే ఆలౌట్ అయింది. దీంతో యూనికార్న్స్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. లీగ్ చరిత్రలో ఇంత భారీ తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి.

ఇజ్రాయిల్ మెరుపు దాడులు.. ఇరాన్ మిలిటరీ చీఫ్ మృతి

టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయిల్ మెరుపులు దాడులతో విరుచుకుపడింది. శుక్రవారం ఇరాన్ లోని నటాంజ్ యురేనియం కేంద్రంతో సహా కీలకమైన ఇరానియన్ అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇజ్రాయిల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనిక అధికారి, సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరితోపాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధిపతి మేజర్ జనరల్ హోస్సేన్ సలామి, ఇతర సీనియర్ అధికారులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్ సైన్యానికి భారీ దెబ్బ తగిలింది. కాగా, ఈ దాడులపై స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ.. ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని.. కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఆరోపణలపై దృష్టి పెట్టని ఇసి

Election Commission faces

మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో బయటపడిన లోపాలపై లోక్‌సభ విపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తారు. అవి నిర్దిష్టమైన అంశాలు సాధారణ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఓటర్ల జాబితాలో అసాధారణంగా ఓటర్లు పెరగడం, పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తరువాత ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఓటు వేయడం, పోలింగ్ ప్రక్రియకు సిసిటివి అనుసంధానం నివారిస్తూ 1961నాటి ఎన్నికల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించడం, ఈ అంశాలపై రాహుల్ ప్రశ్నలు లేవనెత్తారు. 2024 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లోనే మహారాష్ట్రలో 41 లక్షల మంది కొత్త ఓటర్లు చేరడంపై రాహుల్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇది అద్భుతమైన పెరుగుదల అని ఆయన పరిశీలనా పరంగా వ్యాఖ్యానించారు.

ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ సూటిగా సమాధానం చెప్పలేక ప్రతివిమర్శలు చేస్తోంది. వాస్తవంగా పరిశీలిస్తే 2019 శాసనసభ ఎన్నికల్లో (assembly elections) మహారాష్ట్రలో నమోదైన ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు అని, ఇది 2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి 9.29 కోట్లకు పెరిగిందని ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. 2024 నవంబర్ శాసనసభ ఎన్నికల నాటికి ఈ సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలో 31 లక్షలు పెరిగితే కేవలం ఐదు నెలల్లో 41 లక్షలు పెరగడం ఆలోచించాల్సిందే. 2024 లో మహారాష్ట్రలో సగటున గంటకు 58 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లను వేశారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీని ప్రకారం చివరి రెండు గంటల్లోనే 116 లక్షల మంది ఓటర్లు ఓటు వేసి ఉండేవారు. అప్పుడు 76 లక్షల మంది ఓటర్ల పెరుగుదలపై పూర్తిగా నమ్మకం కుదిరేది. కానీ ఓటర్ల సంఖ్య పెరుగుదల రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిగా లేదు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఎక్కడైతే బలహీనంగా కనిపించిందో ఆ 85 నియోజకవర్గాల్లోని 12,000 బూత్‌ల్లో ఈ పెరుగుదల కేంద్రీకృతం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఐదు నెలల్లో ఓటర్ల సంఖ్యలో ఈ అసాధారణ పెరుగుదల ఎలా జరిగిందో కనుగొనడం ఎన్నికల కమిషన్ బాధ్యత. ఇది ఎన్యూమరేటర్లు తమ పనిని అంకిత భావంతో చేయలేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని కూడా రాహుల్ తప్పు పట్టారు. సెలెక్షన్ ప్యానెల్‌లో చీఫ్ జస్టిస్ కూడా భాగంగా ఉండాలని సిఫార్సు చేస్తూ 2023లో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును కేంద్రం బేఖాతరు చేయడం రాహుల్ ఆక్షేపించారు. గతంలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరుపై బిజెపి, కాంగ్రెస్‌లతో సహా రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశారు.

పరిపాలన, సాంకేతిక భద్రతా చర్యలకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంటే చాలా ఫిర్యాదులు పరిశీలనకు నిలబడలేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించింది. ఎత్తి చూపించిన ప్రాథమిక సమస్యలను ఎన్నికల కమిషన్ పరిష్కరించవలసి ఉంది. సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నమోదైన ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు ప్రాథమిక విశ్లేషణలో బయటపడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు చాలా ఎక్కువగా నమోదయ్యారు. సాధారణ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేవలం ఆరు నెలల్లోనే 39 లక్షల మంది కన్నా ఎక్కువ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇదే విధంగా 2014 లోనూ కనిపించింది. దాదాపు 4 మిలియన్ ఓటర్లు పెరగడం భారీ సంఖ్యే. ఈ నేపథ్యంలో జాబితాల పరిశీలనకు ఎన్నికల కమిషన్ ముందస్తుగానే మెషిన్ రీడబుల్ డేటా విడుదల చేయాలి.

సాయంత్రం 5 గంటల తరువాత ఓటర్ల సంఖ్య అమాంతంగా, అసాధారణంగా పెరిగిపోయిందన్న వాదన వినిపిస్తుంటే, ఎలక్షన్ కమిషన్ డేటా మాత్రం మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తరువాత ఓటర్ల సంఖ్య చెప్పుకోదగినంతా పెరగలేదని చెబుతోంది. ఎన్నికల కమిషన్ యాప్ నుంచి వెలువడిన ఈ తాత్కాలిక ఓటింగ్ సంఖ్య మొత్తం పూర్తిగా కచ్చితమని చెప్పలేం. మనుషులు నమోదు చేసిన సంఖ్యపైనే ఇవి ఆధారపడి ఉంటున్నాయి. మెషిన్ కచ్చితంగా లెక్కించిన సంఖ్యతో పోలిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. కొంత ఆలస్యంగా ప్రతి ఎన్నికల బూత్ నుంచి 17సి డేటా ద్వారా వచ్చిన ఖరారైన గణాంకాలు తాత్కాలిక ఓటింగ్ శాతం గణాంకాలపై ఆధారపడడం తప్పు. ఓటింగ్ పూర్తయిన తరువాత పోలింగ్ అధికారి పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను బూత్ లెవెల్ ఏజెంట్లకు తెలియజేయాలి. దీనివల్ల పారదర్శకత ఏర్పడుతుంది.

కానీ మహారాష్ట్ర విషయంలో పోలింగ్ మరుసటి రోజు ఉదయం మొత్తం పోలైన ఓట్ల సంఖ్యను తానే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా బహిరంగంగా ప్రకటించడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ శాతం 58.22 శాతం ఉంటే మర్నాడు 66.05 శాతానికి ఎలా ఎగబాకిందని రాహుల్ ప్రశ్నించడం గమనించాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నికల కమిషన్ స్పందించాల్సిన మరో వాదన ఉంది. ఫిర్యాదులను పరిశీలించడానికి సిసిటివి ఫుటేజీని, ఓటర్ల జాబితాలను పార్టీలకు, ప్రతినిధులకు అందుబాటులో ఉంచడం తప్పనిసరి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వహించడం ఎన్నికల కమిషన్ బాధ్యత. కానీ ఎన్నికల కమిషన్ ఇవన్నీ పక్కనపెట్టి భారత్‌లో ఎన్నికల జాబితా రూపకల్పన అనేది ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ, పారదర్శకమైన ప్రక్రియల్లో ఒకటని స్వోత్కర్ష చేయడంలో పారదర్శకత ఏముంది? భారత ఎన్నికల నిర్వహణలో నిజాయితీ ఉంటోందని, అభ్యంతరాలను, అభ్యర్థనలను పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ పదేపదే ప్రచారం చేసుకోంటోంది.

గుజరాత్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Narendra Modi Droupadi Murmu

అహ్మదాబద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

‘‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్రంగా కలచి వేసింది. ఇది హృదయ విదారకర ఘటన. మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం బాధితులకు తోడుగా ఉంటుంది’’: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

‘‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మాటలకందని విషాదం. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నా’’: ప్రధాని నరేంద్ర మోదీ

ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనస్థలికి వెళ్లారు. ప్రధాని మోదీ రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం చేయాలని.. ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్ చేయాలని కేంద్ర మంత్రిని ప్రధాని ఆదేశించారు.

రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు: సజ్జల

implemented single promise

అమరావతి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా విధ్వంసమేనని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. పార్టీ స్టేట్ కో- ఆర్టినేటర్ సజ్జల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం’ అనే పేరుతో పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ (Book launch) సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..వాస్తవాలు, ఆధారాలన్నీ పుస్తకంలో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.

అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లాంటిదని, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమేనని చెప్పారు. బాబు దుష్టపాలన మొత్తం బుక్ లో వేస్తే 5 వేల పేజీలు అవుతుందని, చంద్రబాబు దుష్టపాలనకు ముకుతాడు వేయాలని ఎద్దేవా చేశారు. ఇంకా నాలుగేళ్లు ఉందికదా అని ఆలోచించకూడదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని గట్టిగా ప్రశ్నించాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

విమాన ప్రమాదంలో.. పలువురు వైద్య విద్యార్థులు మృతి?

Medical Students Flight Crash

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 242 ప్రయాణీకులతో ఉన్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే కుప్పకూలిపోయింది (Flight Crash). అయితే విమానం బిజె ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థుల (Medical Students) హాస్టల్ భవనాలపై కూలింది. ఈ ప్రమాదంలో పలువు వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. భోజన సమయం కావడంతో అధికశాతం మంది విద్యార్థులు హాస్టల్‌లోనే ఉన్నారు. అదే సమయంలో విమానం కూలిపోయింది. దీంతో పలువు విద్యార్థులు మృత్యువాత పడినట్లు సమాచారం. విమానం హాస్టల్ భవనంపై కూలిపోవడంతో భవనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వైద్య విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

డబ్ల్యూటిసి ఫైనల్ అరుదైన ఘటన.. 145 ఏళ్లలో తొలిసారి

WTC Final

లండన్: లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న ఐసిసి డబ్ల్యూటిసి ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతిఫ్రికా హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లోఆస్ట్రేలియాని సఫారీ బౌలర్లు 212 పరుగులకే ఆలౌట్ చేయగా.. తొలి రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నెంబర్ 1 స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఆటగాళ్లు డకౌట్ అయ్యారు.

డబ్ల్యూటిసి ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి పరుగులు చేయకుండా పెవిలియన్ చేరగా.. సఫారీ బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రమ్ 6 బంతులు ఎదురుకొని డకౌట్ అయ్యాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. 1880లో మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్‌ ఇంగ్లండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌తో కలుపుకొని ఇంగ్లండ్‌లో 561 టెస్ట్‌ మ్యాచ్‌లు జరగగా.. ఇప్పటివరకూ ఇలాంటి సంఘటన జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇరు జట్ల నెంబర్ 1 ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ డకౌట్ అవ్వడం ఇది 10వ సారి. తొలిసారిగా 1977లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్, ఆసీస్ బ్యాట్స్‌మెన్ జాన్ డైసన్ డకౌట్ అయ్యారు.

గుజరాత్ లో కూలిన విమానం…. 242 మంది మృతి?

Plane crash in Gujarat

గాంధీనగర్: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ఇండియా విమానం కూలిపోయింది.  సివిల్‌ ఆస్పత్రి సమీపంలో విమానం చెట్టును ఢీకొట్టిన అనంతరం జనావాసాలపై కూలింది. టేకాఫ్‌ అయిన వెంటనే విమానం కూలిపోయింది. అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. బిఎస్ఎఫ్ సిబ్బంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు.   పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అనే విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న 242 మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు గుజరాత్‌ కు బయల్దేరారు. ప్రమాదంపై గుజరాత్‌ సిఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌ చేసి ఆరా తీశారు. విమానంలో మాజీ సిఎం విజయ్‌ రూపానీ ఉన్నట్లు సమాచారం.