ముగిసిన ఇడి విచారణ.. విజయ్ ఏమన్నారంటే..

Vijay Deverakonda

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) విచారణ పూర్తయింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో విచారణ జరిగింది. అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను గేమింగ్‌ యాప్‌నే ప్రమోట్ చేశానని, గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు చాలా తేడా ఉంటుందని అన్నారు. తాను ఎ23 అనే గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేసినట్లు ఇడి అధికారులకు క్లారిటీ ఇచ్చానని తెలిపారు.

‘‘బెట్టింగ్ యాప్స్‌కి, గేమింగ్ యాప్స్‌కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో లీగల్. గేమింగ్ యాప్స్‌కి జిఎస్టి, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయి. నా బ్యాంకు లావాదేవీల వివరాలను ఇడికి ఇచ్చాను. నేను ప్రమోట్ చేసిన ఎ23 యాప్‌ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా. సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలూ ఇడికి ఇచ్చాను’’ అని విజయ్ (Vijay Deverakonda) పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *